మ్యాజిక్ డ్రెయిన్‌ను పరిశీలించిన పవన్
AP: ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా IS జగన్నాథపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. డ్రెయిన్ నిర్మాణం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రెయిన్‌ను ఆనుకుని ఉన్న ఇంటి నుంచి ఒక బిందె నీటిని వంపి పని తీరుని పరిశీలించారు. మిగతా గ్రామాల్లో కూడా దశలవారీగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.