ప్రశాంతంగా 'అక్షరాంధ్ర' పరీక్ష
కోనసీమ: అయినవిల్లి మండల వ్యాప్తంగా 62 పరీక్ష కేంద్రాలలో ఆదివారం 'అక్షరాంధ్ర' పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సరోవర్ మాట్లాడుతూ ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారిని అక్షరాస్యులుగా గుర్తిస్తామని తెలిపారు. మొత్తం 2,428 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు అన్నారు. ఎంఈవో శ్రీనివాసరావు, ఏపీఎం వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు.