నీటమునిగిన నారచీరల ప్రాంతం

BDK: ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాలలో సీతమ్మవారి నారచీరల ప్రాంతం నీట మునిగింది. దుమ్ముగూడెం మండలంలో కురుస్తున్న వర్షాలకు తోడు గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నార చీరల ప్రాంతం చుట్టూ నీరు చేరి సీతమ్మ విగ్రహం కూడా నీట మునిగింది. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని నార చీరల ప్రాంతం దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు.