'డబుల్ బెడ్ రూమ్ రానివారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి'

SRCL: డబుల్ బెడ్ రూమ్ రాని వారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ 5 లక్షలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ప్రభుత్వంలో నిరుపేదలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి ప్రభుత్వంలోనైనా వారికి స్థలంతో పాటు రూ 5 లక్షలు ఇవ్వాలని కోరారు.