వైద్యుడి ఇంట్లో దోపిడీ
SRPT: కోదాడ పట్టణంలో ప్రముఖ వైద్యుడు శ్రీనివాసరెడ్డి నివాసంలో గురువారం సాయంత్రం దోపిడీ జరిగింది. బురఖా, హెల్మెట్ ధరించిన దుండగుడు ఇంట్లోకి చొరబడి, వైద్యుడి భార్య పద్మావతిని కత్తితో బెదిరించి 4 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. ఆమె కేకలతో నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.