శ్రీనివాస్‌కి అవార్డు అందజేసిన కలెక్టర్
HNK: మాదిగ మహాజనుల వేదిక కన్వీనర్ గబ్బేట శ్రీనివాస్‌కి ఇటీవల దళిత రత్న అవార్డు లభించింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఈ అవార్డు రాగా.. ఇవాళ హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.