గోగులదిన్నెలో రీ సర్వే కార్యక్రమం
మార్కాపురం మండలం గోగులదిన్నెలో బుధవారం రీ సర్వేను ఎమ్మార్వో చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 231 గల హద్దు రాయి వద్ద పూజ చేసి ప్రారంభించారు. రీ సర్వేలో ప్రతి ఒక్క రైతు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్, మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.