నల్లమల అడవుల్లో పులుల గణన ప్రారంభం

నల్లమల అడవుల్లో పులుల గణన ప్రారంభం

NDL: రుద్రవరం మండలం నల్లమల అడవుల్లో అఖిలభారత పులుల అంచనా-2026 కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 1 నుంచి పులుల గణన జరుగుతోందని శుక్రవారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ముర్తుజా వలి తెలిపారు. అటవీ సిబ్బంది కాలి బాటన నడుస్తూ... పులి, చిరుత, ఎలుగుబంటి వంటి మాంసాహార జంతువుల ప్రత్యక్ష, పరోక్ష ఆనవాళ్లను సేకరిస్తున్నారు. గణన ద్వారా పులుల సంఖ్యను అంచనా వేయనున్నారు.