చందాలతో రేషన్ డిపో నిర్మాణం

చందాలతో రేషన్ డిపో నిర్మాణం

ASR: ​జికె వీధి మండలం అగ్రహారం గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో రేషన్ డిపో లేక ఇబ్బందులు పడుతుంటే, అధికారుల కోసం చూడకుండా 110 మంది కార్డుదారులు చందాలు వేసుకున్నారు. రూ.1.10 లక్షలతో సొంతంగా రేషన్ షెడ్డు నిర్మించుకున్నారు. సమస్య పరిష్కారానికి ఎవరి కోసమో ఎదురుచూడకుండా గ్రామస్తులే స్వయంగా డిపో నిర్మించుకోవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.