VIDEO: అల్లు వారింట పెళ్లిసందడి
అల్లు వారింట పెళ్లిసందడి ప్రారంభమైంది. అల్లు శిరీష్‌ను పెళ్లి కొడుకును చేసే వేడుక వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అల్లు శిరీష్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వేడుకలో ఇటీవల వివాహం చేసుకున్న కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ నూతన వరుడిని ఆశీర్వదించి సందడి చేశారు.