సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం
NDL: ప్యాపిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ జగదీశ్ మాట్లాడుతూ.. ఈ చట్టం ప్రతి పౌరుడికి ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించే హక్కు ఇస్తుందని చెప్పారు. ఇది ప్రజలకు శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువత, రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు.