'ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయాలే ముఖ్యం'

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల పై పగ, ప్రతీకారం తీర్చుకుంటుందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదని తెలిపారు.