విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి.. స్పందించిన పవన్

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి.. స్పందించిన పవన్

AP: కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందగా ఆరుగురు యువకులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.