అప్పన్నకు బంగారు చైన్ బహుకరణ

అప్పన్నకు బంగారు చైన్ బహుకరణ

VSP: సింహాద్రి అప్పన్న స్వామికి శ్రీకాకుళానికి చెందిన రాజారాం, కిరణ్ రాజ్ 49 గ్రాముల బంగారు శంఖు నామ చక్రాలతో కూడిన చైన్ను బహుకరించారు. ఆలయ డిప్యూటీ ఈవో సింగం రాధా, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు సమక్షంలో స్వామివారికి ఈ వస్తువును అందించారు. దాతలకు స్వామివారి దర్శనం కల్పించి వేద ఆశీర్వాచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.