అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 357 మంది అంగన్వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు ఇవాళ మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. మునుగోడులో జరిగిన ఈ కార్యక్రమంలో.. అంగన్వాడీలది సమాజంలో కీలక బాధ్యతని, వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యలపై చర్చించే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందన్నారు.