నిరుద్యోగ యువతకు శుభవార్త

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు. విద్యార్థులు ఉపాధి కార్యాలయంలో మేళాకు హాజరుకావాలని మరిన్ని వివరాలకు 9848895937 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.