నేరాల నియంత్రణపై ఎస్పీ కట్టుదిట్టమైన ఆదేశాలు

నేరాల నియంత్రణపై ఎస్పీ కట్టుదిట్టమైన ఆదేశాలు

సత్యసాయి: బాధితులకు న్యాయం చేసినప్పుడే పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తిలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు.