వరంగల్ వాసులను ఇబ్బంది పెడుతున్న కోతులు

వరంగల్ వాసులను ఇబ్బంది పెడుతున్న కోతులు

WGL: గ్రామీణ ప్రాంతాల వరకే పరిమితమైన కోతుల సమస్య వరంగల్ నగరాన్ని తాకింది. వరంగల్లోని గిర్మాజీపేట్లో కోతులు స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోకి దూరి తినుబండారాలు ఎత్తుకెళ్తున్నాయని, తాగునీటి కోసం భవనాల మీద ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ నల్ల పైపులను ధ్వంసం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.