జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్లు పరిహారం..!
KRNL: అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యానికి బలైన కర్నూలు విద్యార్థిని కందుల జాహ్నవి కేసులో కీలక మలుపు తిరిగింది. ఆమె మృతికి పరిహారంగా 29M డాలర్లు (సుమారు రూ.262 కోట్లు) చెల్లించేందుకు సియాటెల్ నగరం అంగీకరించింది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన చేశారు. అయితే, ఈ భారీ సెటిల్‌మెంట్‌పై జాహ్నవి కుటుంబం, వారి తరఫు లాయర్లు స్పందించాల్సి ఉంది.