'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు'

'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు'

కోనసీమ జిల్లాలో రౌడీయిజం, గూండాయిజం అణచివేతకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. SP రాహుల్ మీనా ఆదేశాల మేరకు పి.గన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీసులు రౌడీ షీటర్ల ప్రస్తుత ప్రవర్తనను సమీక్షించి, వారికి పలు కీలక సూచనలు చేశారు. పాత నేరాలు పునరావృతం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.