VIDEO: గీతా మందిరంలో శ్రావణమాస పూజలు

SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీరామ గీత మందిరంలో శ్రావణ మాసం పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చనలు ముత్తైదువులతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గీతా మందిర ప్రధాన అర్చకులు పీసపాటి సూరిబాబు ఆధ్వర్యంలో చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం కూడా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.