HYDలో హెరిటేజ్ వాక్.. సందడి చేసిన విదేశీయులు
HYDలో వారసత్వ సోయగాలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్‌లో దేశ విదేశాల నుంచి వచ్చిన 60 మంది మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. నగర చరిత్ర, నిర్మాణ శైలి, సంస్కృతి గురించి అవగాహన పెంపొందిస్తూ ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. తెలంగాణ పర్యాటక శాఖ ఇలాంటి వాక్‌లతో వారసత్వ పరిరక్షణకు ప్రోత్సాహం అందిస్తోంది.