అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీ

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీ

NRPT: మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదిక వద్ద అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ఇంఛార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి ఫోన్లు అందించారు. సాంకేతికతతో పనులు సులభతరం అవుతాయని టీచర్లు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఛైర్మన్ సరస్వతి, వైస్ ఛైర్మన్ భాగ్యశ్రీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.