గుత్తి మున్సిపాలిటీలో వాడివేడిగా కౌన్సిల్ సమావేశం
ATP: గుత్తి మున్సిపాలిటీలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా సాగింది. వార్డులోని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని కౌన్సిలర్లు అధికారులపై మండిపడ్డారు. వార్డులోని సమస్యలు పరిష్కరించాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.