VIDEO: పాఠశాలను మార్చొద్దంటూ మంత్రికి చిన్నారుల వినతి

NLR: ఆత్మకూరు పట్టణంలోని వెస్ట్ స్కూల్‌ను ఇక్కడే కొనసాగించాలని విద్యార్థులు మంత్రి లోకేశ్‌కు విన్నవించుకున్నారు. 'లోకేశ్ మామయ్య.. మా పాఠశాలను ఎక్కడికి మార్చకండి. ఇక్కడే కొనసాగించండి. ఇక్కడే చదువులు బాగున్నాయి' అంటూ కోరారు. మరోవైపు పిల్లల తల్లిదండ్రులు సైతం పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని, వేరే చోటికి తరలిస్తే పిల్లలకు ఇబ్బందిగా ఉంటుందని వాపోయారు.