సమాజం నుంచి పాఠాలు నేర్చుకోండి: గవర్నర్

TG: కార్పొరేట్ నిపుణులు సమాజం నుంచి పాఠాలు నేర్చుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. స్థానిక, గిరిజన సమాజాలు ప్రకృతి వనరులను వస్తువులుగా మాత్రమే చూడవని, ప్రకృతితో సామరస్యంగా జీవిస్తాయన్నారు. ఆ సమాజాల నుంచి కార్పొరేట్ నిపుణులు పాఠాలు నేర్చుకోవాలన్నారు. ప్రతి పౌరుడిలాగే న్యాయంగా, పారదర్శకత, సుస్థిర అభివృద్ధితో ప్రకృతిని సమతుల్యం చేస్తూ బాధ్యతతో మెలగాలన్నారు.