'పెళ్లయిన వ్యక్తి సహజీవనం చేయడం నేరం కాదు'
అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహితులు వేరొకరితో సహజీవనం చేయడం నేరం కాదని తెలిపింది. పరస్పర సమ్మతితో సహజీవనంలో ఉంటే వారిపై అభియోగాలు మోపలేరని వెల్లడించింది. సామాజిక అభిప్రాయాలు, నైతిక విలువల ఆధారంగా కోర్టులు పౌరుల హక్కులను కాలరాయలేవని పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ జంట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ విధంగా తీర్పునిచ్చింది.