నిజాంసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగిపోతోంది. శుక్రవారం 27,352 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి 27,352 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 17.802 టీఎంసీలతో పూర్తిస్థాయిలో నిండి ఉందన్నారు.