VIDEO: శ్రీకాళహస్తి-అంజూరు మధ్య రాకపోకలు బంద్

VIDEO: శ్రీకాళహస్తి-అంజూరు మధ్య రాకపోకలు బంద్

TPT: తొట్టంబేడు మండలంలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో చిట్టత్తూరు వద్ద వాగు పొంగి పొర్లుతోంది. చిట్టత్తూరు ఎగువ ప్రాంతమైన తిమ్మసముద్రం, బైరాజు కండ్రిగ, కేవీబీపురం మండలాల్లోని గ్రామాల నుంచి వరద నీరు వస్తోంది. దీంతో శ్రీకాళహస్తి-అంజూరు మద్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరూ వెళ్లకుండా తొట్టంబేడు ఎస్ఐ బలరాం సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.