గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించిన పీవో
PPM: సాలూరు మండలం కొత్తవలస ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఐటీడీఏ పీవో యశ్వంత్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య స్థితిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాల, హాస్టల్ ప్రాంగణంలో పారిశుధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.