రేపటి నుంచి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

TPT: గూడూరు పట్టణం రాజావీధిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనునట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు తెలిపారు. ప్రతిరోజు విశేషాలంకారాలతో పాటు పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.