ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు
మహబూబ్‌నగర్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఇందిర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పాపన్న విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రామ గౌడ్ పాల్గొన్నారు.