VIDEO: డీఎస్పీ కార్యాలయం వద్ద వైసీపీ ఆందోళన
ATP: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని పోలీసులు గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తీసుకురాగా ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. వెంకటరెడ్డిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పాల్గొన్నారు.