VIDEO: 'ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి'
WGL: JPN రోడ్డులోని దత్తాత్రేయ ఫర్నిచర్ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై షాప్ యజమాని సతీష్ మాట్లాడుతూ.. కూలర్‌లో గడ్డి అంటుకుని మంటలు చెలరేగి.. షాపు దగ్ధమైందని తెలిపాడు. రూ.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ స్పందించి తగిన నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరాడు.