ఆ గ్రామంలో ఒకే ఒక్క సామాజిక వర్గం
KNR: శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలోని ఎస్సీ కాలనీని ప్రభుత్వం అంబేడ్కర్ నగర్‌గా గుర్తించి నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. అయితే ఈ గ్రామంలో 368 మంది ఓటర్లు ఉండగా 273 కుటుంబాలలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. వేరే సామాజిక వర్గానికి చెందినవారు ఈ గ్రామంలో లేకపోవడంతో గ్రామ సర్పంచ్ ఎస్సీ మహిళకు వార్డులు కేటాయించారు.