ఆ గ్రామంలో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్
BDK: రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న గ్రామం భద్రాచలం. ఆ గ్రామంలో 40, 761మంది ఓటర్లు, 20 వార్డులు ఉన్నాయి. ఈసారి ST రిజర్వ్డ్ అయిన స్థానానికి 5 గురు బరిలో నిలిచారు. 75 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. అయితే, ఎక్కువ మంది ఓటర్లు ఉండటంతో పోలింగ్ కాస్త ఆలస్యంగా పూర్తి అయింది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పూర్తి ఫలితాలు వెలువడేందుకు మరింత సమయం పట్టనుంది.