VIDEO: 'అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదు'
SKLM: దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ శైలజ ఆధ్వర్యంలో దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ గ్రీవెన్స్‌లో పాల్గొని దివ్యాంగుల నుంచి 7 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.