ముగిసిన వేసవి నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరం

ముగిసిన వేసవి నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరం

KMM: అమెరికన్-ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్‌‌లోని భవిత కేంద్రంలో గత నెల 23న ప్రారంభమైన ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ గూడెపు స్వప్న ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ తరగతుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10వ తరగతుల విద్యార్థులు దాదాపు 50 మంది ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు.