అదుపుతప్పి కారు బోల్తా
BHPL: కమలాపూర్ గ్రామ శివారులో మంగళవారం కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. బోర్లగూడెం నుంచి హన్మకొండకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న సమయంలో కమలాపూర్ మూల మలుపు వద్ద కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో ఇద్దరికి స్వల్పగాయలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.