నేడు కలెక్టరేట్ లో పంచాయతీ రిజర్వేషన్ల లాటరీ

నేడు కలెక్టరేట్ లో పంచాయతీ రిజర్వేషన్ల లాటరీ

WNP: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మహిళా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో డ్రా తీయనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మండల, పట్టణ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనాలని కలెక్టర్ కోరారు.