జనసేనలో చేరికలు స్థానిక ఎన్నికలపై వరుణ్ సమీక్ష
ATP: అనంతపురంలోని జనసేన కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నూతన మండల, టౌన్ కమిటీలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, క్రియాశీలక సభ్యత్వాలపై చర్చించారు. అనంతరం పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు.