చెరువులో దూకి వ్యక్తి సూసైడ్

చెరువులో దూకి వ్యక్తి సూసైడ్

MDK: కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గ్రామంలో చాకలి శేఖర్ అనే వ్యక్తి గురువారం రాత్రి చెరువులో దూకాడు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఫైర్ ఆఫీసర్ ప్రశాంత్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గంట పాటు వెతికి మృతదేహాన్ని వెలికి తీశారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.