'కోర్టుకు హాజరుకాని నిందితుని పట్టివ్వండి'

'కోర్టుకు హాజరుకాని నిందితుని పట్టివ్వండి'

MLG: ఏటూరునాగారం మండలం గుర్రాలబావి గుత్తికోయగూడెం వాసి పోడియం భీమయ్య అనే నిందితుడు ఓ కేసులో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడని సీఐ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. అతడిపై వారెంట్ జారీ అయిందని, ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రజలు సహకరించి సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.