యూజర్లకు జియో శుభవార్త
తమ యూజర్లకు జియో శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారికి మాత్రమే అందించిన గూగుల్ జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను.. తాజాగా 25 ఏళ్ల పైబడిన వారికి అందిస్తున్నట్లు సమాచారం. దీంతో అన్ని వయసుల వారికీ రూ.35,100 విలువైన జెమినీ ప్లాన్ 18 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ పొందాలంటే నెలకు రూ.349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.