VIDEO: 'రోడ్డు భద్రతపై గ్రామాల్లో అవగాహన అవసరం'
KNR: రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు అవసరమని కలెక్టర్ చైత్ర మిశ్రా తెలిపారు. రామకృష్ణకాలనీలో నిర్వహించిన 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గ్రామాల్లో సర్పంచ్లు సమావేశాలు నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.