అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో బాపట్ల రైతులు..!
BPT: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు వారి సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పుకునేందుకు రైతులతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు వారి సమస్యలను వాట్సాప్ గ్రూప్‌లో పెట్టే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారుల సమావేశంలో సూచించారు.