VIDEO: నిజామాబాద్‌లో BRS దీక్ష దివస్ వేడుకలు
NZB: కేంద్రంలో BRS దీక్ష దివస్ వేడుకలను శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం BRS జిల్లా కార్యాలయంలో వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, BRS జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.