మితిమీరి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు

ప్రకాశం: మితిమీరి ప్రయాణికులను ఆటోలలో ఎక్కించుకోవద్దని కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ అన్నారు. మంగళవారం కనిగిరి గ్రామ శివారులో డీఎస్పీ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోలలో ప్రయాణికులు ఎక్కువ మంది ఎక్కడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.