'గివ్ హర్ స్పేస్' పోస్టర్ ఆవిష్కరించిన కవిత
HYD: తెలంగాణ జాగృతి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'గివ్ హర్ స్పేస్' పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ జాగృతి మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గివ్ హర్ స్పేస్ అంటూ తమ నినాదాన్ని వినిపించారు.