ఈనెల 5న సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు
NLG: దేవరకొండలోని శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 5న ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు వనం జగదీశ్వర్ తెలిపారు. శ్రీ భవాని మృత్యుంజయేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకాలు, 11:30 గంటలకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, అనంతరం మహా అన్న ప్రసాదం వితరణ ఉంటుందన్నారు. రాత్రికి ఆకాశ దీపోత్సవం, కార్తీక దీప పూజలు జరుగుతాయన్నారు.